Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- 428 ఇండ్ల పట్టాల పంపిణీ
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయటానికి ఎంతో కషి చేస్తున్నదని రాష్ర మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 58,59 జీఓ ద్వారా మంజూరైన ఇండ్ల పట్టాలను శనివారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పెద్దబావి లక్ష్మారెడ్డి గార్డెన్లో మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి అధ్యక్షతన మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 58, 59 జీవోల ద్వార పేద కుటుం బాలకు ఇండ్ల పటాలను పంపిణీ చేసి వారికి ఎంతో చేయూత నివ్వడం జరుగుతుందన్నారు. 58 జీవో ద్వారా బడంగ్ పేట్ మున్సి పల్ కార్పొరేషన్లో పేదలకు 428 పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. పేద ప్రజలు ఎన్నో సంవత్సరాల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. పేద కుటుంబానికి తన ఇంటికి సంబంధించిన పట్టాలు తన దగ్గర ఉన్నాయనే దైర్యం వారికి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తన ఇంటిపై రుణం తీసుకొని సమస్యలు పరిష్కరించుకునే విధంగా పట్టా ఎంతో ఉపయోగపడుతుందనే దీమా కలుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్, ఆర్డీవో సూరజ్ కుమార్, బాలాపూర్ మండల తాసిల్దార్ జనార్దన్ రావు, ఫ్లోర్ లీడర్ సుర్ణ గంటి అర్జున్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ యాతం పవన్ యాదవ్, కార్పొరేటర్లు పెద్దబావి శోభ ఆనంద్ రెడ్డి, సుక్క శివకుమార్, ఏనుగు రామిరెడ్డి, ముత్యాల లలితా కష్ణ, లిక్కి మమతా కష్ణ రెడ్డి, బి.రోహిణి రమేష్, సంరెడ్డి స్వప్న వెంకటరెడ్డి, వివిధ పార్టీల కార్పొరేటర్లు , కోఆప్షన్ సభ్యులు గుండోజి రఘునందన్ చారి, ఎస్కే ఖలీల్ పాషా, బీఆర్ఎస్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, నాదర్ గుల్ రైతు సహకార సంఘం బ్యాంక్ చైర్మెన్ మర్రి నరసిం హారెడ్డి,నాయకులు తుఫాన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు కోటగిరి జంగయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు పుట్టగల్ల సంతోష్ కుమార్, యు వజన విభాగం ఉపాధ్యక్షులు ఆక్విల్, చిత్రం సాయి, సోషల్ మీడిj ూ నియోజకవర్గ కన్వీనర్ సాంబశివ తదితరులు పాల్గొన్నారు.