Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ ఆవిర్భావకు సంబంధించిన కరపత్రం శుక్రవారం ఎల్బీ నగర్‌లోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహం దగ్గర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫ్రంట్ కన్వీనర్ బొంగు ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ భావసారూప్య పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక న్యాయ వాదులు, సామాజిక ప్రజాస్వామ్యవాదులందరూ ఒక వేదిక పైకి వచ్చి సామాజిక తెలంగాణ ఫ్రంట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఫ్రంట్ కు చైర్మెన్‌గా ప్రొఫెసర్ మురళీ మనో హర్, కో చైర్మెన్‌గా రాజీనామా చేసిన ఐఏఎస్ ఆకునూరు మురళి ఉన్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చామకూర రాజు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ కోసం మరో రాజకీయ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణలో సామాజిక ప్రజాస్వామ్యం చంపివేయబడిందని, ప్రజాస్వా మ్యంకి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రంట్ కోకన్వీనర్లు మంగిళిపల్లి శంకర్ గంగపుత్ర, కె వి గౌడ్, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఘోర శామ్‌సుందర్ గౌడ్, బీసీ జర్నలిస్టు పురం నాయకులు శ్యామ్ యాదవ్, రాకేష్, కుడుపూడి మహేష్, రాకేష్, అభిషేక్, నితీష్, తదితరులు పాల్గొన్నారు.