Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2023 దళిత రత్న అవార్డును డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గురువారం నగరంలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్ల గూడలో గల జీఎస్ఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంతీయ కార్యదర్శి మధిర సత్యనా రాయణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేసిన సామాజిక సేవల ను ప్రభుత్వం గుర్తించి దళిత రత్న బిరుదుతో సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో నాకు మరిన్ని భాధ్యతలు పెరిగాయనిపేర్కొన్నారు. నగరంలో ఉన్న దళిత బస్తిలో నివసిస్తున్న దళితులు తమ పిల్లలను తప్పకుండా పాఠశాలలకు పంపించాలని అంబేద్కర్.. చదివించు, సాధించు, పోరాడు అనే నినాదాలను అనుసరించిన వాళ్లమౌతామని అన్నారు. తెలంగాణ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు మేడి పాపయ్య,ఆల్ ఇండియా జీఎస్ఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదర్ల మహేష్, రమేష్ చౌగలే, సాయి,సుచిత తదితరులు పాల్గొన్నారు.