Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ దీపిక శేఖర్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
లోవొల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ ప్రజల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నానని కార్పొరే టర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేటర్ మాట్లాడుతూ.. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5వ డివిజన్ వినాయక హిల్స్ ఫేస్ 2లో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సహకారంతో నూతనంగా ట్రాన్స్ఫార్మార్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను బడుగు బలహిన వర్గాల ప్రజలకు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరుగుతుం దన్నారు.అనంతరం స్థానిక కార్పొరేటర్ నూతన ట్రాన్స్ఫా ర్మార్ కు కాలనీ వాసులతో కలిసి పూజా కార్యక్రమాలు చేశారు. రానున్న వేసవి కాలంలో లోవోల్టేజ్ సమస్య లేకుండా ప్రత్యేకంగా నూతనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.