Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిపుర హైకోర్టు చీఫ్ జస్టీస్ అమర్నాథ్ గౌడ్
- చర్లపల్లి కేంద్ర కారాగారం సందర్శన
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ జైళ్లశాఖలో చేపడుతున్న ఖైదీల సంక్షేమాభివృద్ధి ఫలాలు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయని తిపుర రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టీస్ అండ్ ఎగ్జిక్యూటీవ్ చైర్మెన్, తిప్రుర స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ టి. అమర్నాథ్ గౌడ్ అన్నారు. శుక్రవారం చర్లపల్లిలోని కేంద్ర కారాగారం, ఖైదీల వ్యవసాయ క్షేత్రంను త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ టి. అమర్ నాథ్, త్రిపుర హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మెన్ ఎ. లోథ్, త్రిపుర స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ డి.ఎం. జ మాతియా, తిపుర జైళ్లశాఖ ఐజీ అదితి మజుంబర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెషన్ జడ్జి సురేష్, న్యాయ మూర్తి రాధిక లు ముఖ్య అతిథులుగా విచ్చేసి తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ వై. రాజేష్, వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీనివాస్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జైళ్ల సందర్శన త్రిపుర జైళ్ల శాఖ అభివద్ది ప్రమాణాలు పెంచడంలో తోడ్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. త్రిపుర జైళ్లశాఖలోను తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఖైదీలలో సత్ప్రవర్తనయే పరమావధిగా చేపడుతున్న అభివృద్ధిని అభినందించారు.
విచ్చేసిన అతిథిలకు ఖైదీల వ్యవసాయక్షేత్రం పర్యవేక్షణాధికారి కళాసాగర్ పవర్‌పాయింట్ ద్వారా జైల్లో చేపడుతున్న ఖైదీల సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలను క్షుణ్ణంగా తెలిపారు. చేపల పెంపకం, కొళ్ల పెంపకం, పశువుల డైరీ, తదితర పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన, రుణ సదుపాయ సౌకర్యం వివరించారు. తర్వాత జైలు ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారం సందర్శించి జైల్లోని ములాఖాత్, వృత్తి విద్య, పరిశ్రమలు, ఖైదీలకు కల్పించే సౌకర్యాలను సవివరం గా పర్యవేక్షణాధికారి సంతోష్ కుమార్ రారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంచల్‌గూడ జైలు పర్యవేక్షణా ధికారి శివ కుమార్, ఉప పర్యవేక్షనా ధికారులు చింతల దశరథం, కృష్ణమూర్తి, శశికాంత్, జైలర్లు సాయిసరేష్, ఆనందరావు, పరుశురామ్, నె హ్రూ, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.