Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవిడ్ సమయంలో అద్భుతంగా పని చేశారు
- వైద్య పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నారు
- ఇక్కడి సదుపాయాలతో ప్రజలకు ఉపయోగం
- సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ
నవతెలంగాణ-సిటీబ్యూరో/దుండిగల్
ఎస్ఎల్జీ హాస్పిటల్ సేవలు అనన్య సామాన్యం అనీ, కొవిడ్ సమయంలో అద్భుతంగా పని చేశారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రశంసించారు. అన్ని విభాగాలకు అవసరమైన సకల సదుపాయాలతో ఈ ప్రాంతవాసులకు సేవలందించేలా ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించినందుకు దండు శివరామరాజుకు అభినందనలు తెలిపారు. కొవిడ్ సమయంలో 250 ప్రత్యేక పడకలతో అద్భుతంగా పని చేశారన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లక్ష్మినారాయణ మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఈ ఆస్పత్రి సీఎండీ దండు శివరామరాజు పుట్టినరోజు ఒక్కటే కావడం ఎంతో సంతోషం అన్నారు. ఆయన దార్శనికతకు నిదర్శనంగా ఈ ఆస్పత్రి కనిపిస్తోందన్నారు. ఇక్కడి వైద్యుల నిబద్ధత, రోగులకు అందుబాటులో ఉన్న అత్యాధునిక సదుపా యాలు.. ఇవన్నీ చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. ఎయిర్ అంబు లెన్సులు నేరుగా ఆస్పత్రిపైనే దిగే అవకాశం ఉండటం, అక్కడి నుంచి రోగులను నేరుగా ఆపరేషన్ థియేటర్లలోకి తీసుకెళ్లగల గడం, ఫార్మసీకి రోగుల సహాయకులు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచి నేరుగా వార్డుల్లోకి మందులు వచ్చే సదుపాయం, కేన్సర్ రోగులకు చికిత్స అందించేదుకు రూ.కోట్ల విలువ చేసే పరికరాలు.. ఇవన్నీ ఇక్కడే చూడగలం అన్నారు. డాక్టర్ రంగనాథన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందనీ, ఆయన వల్లే తన భార్య లేచి తన కాళ్లపై నిలబడగలు గుతున్నారన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు విజన్ చాలా బాగుందన్నారు. వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం లాంటివి అందరికీ అందుబాటులో వైద్యాన్ని చేరుస్తాయన్నారు. ఈ ఆస్పత్రి కేవలం బాచుపల్లి ప్రాంత వాసులకే కాదు, దేశానికే తలమానికం అన్నారు.
లాభాపేక్ష కాదు.. ప్రజాసేవే పరమావధి..
ఎస్ఎల్జీ ఆస్పత్రిని నెలకొల్పాలని తాము అనుకున్నప్పుడు అందులో లాభాల గురించి ఏమాత్రం ఆలోచించలేదనీ, ఈ ప్రాంతవాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, పొరుగు రాష్ట్రాల వారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలను అందించాలనే భావించామని ఆస్పత్రి సీఎండీ దండు శివరామరాజు అన్నారు. దానికి తగినట్లే ఆస్పత్రికి ప్రజాదరణ బాగుందనీ, అన్ని రకాల సమస్యలకు సమర్థంగా చికిత్స చేసే వైద్యులు అందుబాటులో ఉండటం తమకు కలిసొచ్చిందన్నారు. అందరి సంపూర్ణ సహకారంతో ఆస్పత్రి మరింత విజయవంతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
60 ఏండ్ల దాటిన వారికి ఉచిత ప్యాకేజీ : సోమరాజు
ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా ఎస్ఎల్జీ ఆస్పత్రి ఆధ్వర్యంలో 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని నిర్ణయించినట్టు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమరాజు తెలిపారు. ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు ఈసీజీ, 2డి ఎకో, ఎక్స్ రే, ఆర్బీఎస్, ఎముకల సాంద్రతను నిర్ధారించే డెక్సాస్కాన్ లాంటి పరీక్షలు పూర్తి ఉచితంగా చేస్తామన్నారు. ఫిజిషియన్, కార్డియాలజిస్టుల కన్సల్టేషన్ కూడా ఉంటుందని తెలిపారు. ఒకవేళ వీటితోపాటు అదనంగా ఇంకా ఏమైనా పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తే, వాటన్నింటిపైనా 50శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. పెద్ద వయసు వారికి మెట్లు ఎక్కినా, నడిచినా ఆయాసం వస్తుందనీ, అది ఊపిరితిత్తులు లేదా గుండెలో సమస్య కావచ్చని.. అందువల్ల అలాంటివారంతా ఈ ప్యాకేజీని ఉపయోగించుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలోని వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.