Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సరూర్నగర్
యువత సమయం వృధా చేసుకోకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్కేపురం డివిజన్ పరిధిలో నూతన డిజిటల్స్ ప్రింటింగ్ ప్రెస్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా తమ సంస్థలో ఉద్యోగిగా బాధ్య తలు నిర్వహించి, నేడు స్వంతంగా డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేసుకుం టున్న వనం రాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. వారిని అభినం దించారు. ప్రింటింగ్ యంత్రానికి రూ. 51,000 వేలు ఆర్థిక సహాయాన్ని అంద జేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గం ఉపధ్యక్షుడు నానవాల జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, కష్ణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్, శ్రావణ్, జహంగీర్, విప్లవ్, అనుధీప్, సాయి, జగదీష్, వనం శివ, రవి తదితరులు పాల్గొన్నారు.