Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమ్మద్ అలీ
నవతెలంగాణ - సంతోష్‌నగర్
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్‌గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. ఆదివారం మలక్‌పేట, చంద్రాయణగుట్ట, చార్మినార్, యాకత్పురా నియోజకవర్గం ఇన్చార్జి సామ సుందర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, అజాంపుర డివిజన్ పరిధిలోని ఆజాం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులచే మరియు వీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గం అంతా గులాబీ మయంగా మారింది. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. స్విస్ బ్యాంక్‌లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తామని చెప్పి ఇంత వరకు ఎందుకు వేయలేదో ప్రధాని చెప్పాలని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగే ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గతంలో నీటి కోసం యుద్ధాలు చేసిన సందర్భాలు కోకొల్లలుగా చూశామని తెలిపారు. బిందెలతో రోడ్లపై క్యూలు కట్టిన రోజులు చూశామని, మహిళల నీటి కష్టాలు చూసిన సీఎం కేసీఆర్ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంటికి తాగునీళ్లు అందిస్తున్నది వాస్తవం కాదా అని చారు ప్రశ్నించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా నీటి సమస్యను పరిష్కరించామన్నారు. నగరంలో ఎలా అయితే నీళ్లు ఇస్తున్నామో గ్రామీణ ప్రాంతాల్లోనూ మిషన్ భగీరధ నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ మంచినీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉద్యమకారులు, మహిళలు, పలు విభాగాల అనుబంధ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పలు కాలనీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.