Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరీశెట్టి చంద్ర శేఖర్
నవతెలంగాణ- సరూర్నగర్
చలివేంద్రాలు పాదాచారుల దాహార్తిని తీరుస్తాయి అని ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరీశెట్టి చంద్రశేఖర్ గుప్త అన్నారు. ఆదివారం వాసవి కాలనీలోని బస్టాప్ వద్ద వాసవి కాలనీ ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో చలివేంద్రానికి ముఖ్య అతిథిలుగా హాజరై ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారుల, వాహనాలపై వెళ్లే వారి దాహార్తిని తీర్చడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైైర్మెన్ కె.ఎన్.ఎల్. శ్రీనివాస్, అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి శ్రీహరిరావు, కాలనీ సెక్రటరీ అయిత అంజయ్య, అష్టలక్ష్మీ దేవాలయం అక్షయ ట్రస్ట్ కార్యదర్శి సుధాకర్, దామోదర్, కాలనీ ప్రతినిధులు చిలుక ఉపేందర్ రెడ్డి, శుభకర్, కృష్ణ మూర్తి, భరత్వాజ్, రాంకిషన్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, గౌరీ శంకర్, శ్రీకాంత్, లక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు.