Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్నాథ్ యాదవ్
నవతెలంగాణ-నాగోల్
పండగ మానవాళికి హితాన్ని బోధిస్తుందని ముస్లిం అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం మానవాళికి హితాన్ని అందిస్తుందని నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేంద్రనాథ్ యాదవులు అన్నారు. ఆదివారం నాగోలు డివిజన్లోని జై కాలనీలో గల మజీదులో జరిగిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా పాల్గొని డివిజన్లోని ముస్లిం సోదరులకు తోఫా కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ అనుసరిస్తారని ఇస్లామీయ క్యాలెండర్ లో 9వ నెల రంజాన్ అని ఈ రంజాన్ నెలలో పవిత్ర దైవ గ్రంథం అవతరించిందని వారు తెలిపారు. దీంతో రంజాన్ పండుగ ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, దానధర్మాలు చేస్తారని పేర్కొన్నారు.
పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సాంస్కృతికి, వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. పండగ అనేది ఏ మతం సంబంధించినదైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్లో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.