Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
- కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి హెచ్చరిం చారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గుల్ గ్రామంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారి బాబు ఆధ్వర్యంలోని తోట జంగారెడ్డి గార్డెన్లో నిర్వహించిన ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, ఎల్మెట్టి అమరేందర్ రెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, జంగారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే పేద, బడుగు బహీనవర్గాల ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగినట్లు తెలిపారు. పార్టీకి పునాది కార్యకర్తలేనని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి, ఆర్.సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరాం రెడ్డి, సీనియర్ నాయకులు పుట్టగల్ల జగన్, వెంకటేష్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, నాయకులు ధనరాజ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు, గ్రామస్థాయి నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళ నాయకురాలు, ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.