Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నాయకులు దాసరిబాబు, పెంటయ్య
నవతెలంగాణ-బడంగ్పేట్
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్పదని సీిఐటీయూ నాయకులు దాసరి బాబు, పెంటయ్యలు అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐటీయూ నాయకులు దాసరి బాబు,పెంటయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కార్మికుల వివిధ సమస్యల గురించి చర్చించారు. అందులో ముఖ్యంగా కార్మికులకు ఒకపూట పని విధానం అమలు చేయాలని, ఆదివారం సెలవు ఇవ్వాలని, అందరు సంతకాలు చేసి తీర్మానం చేయటం జరిగిందన్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికైనా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, జంగమ్మ, జ్యోతి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.