Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-ఘట్కేసర్
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర గ్రామ గ్రామానికి తెలియవరిచే విధంగా గౌడన్న కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ పట్టణం యంనంపేట చౌరస్తాలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పావన్న విగ్రహాన్ని ఆదివారం కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌లతో మాజీ హోం శాఖ మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ కలసి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారం దిశగా 350 ఏళ్ళ క్రితం నాడే సర్దార్ పావన్న గౌడ్ వునాదులు వేశాడని, చరిత్ర దాచిపెడితే దాగదని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గౌడన్నలకు రాష్ట్రంలో 400 వైన్స్ పావులలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రభుత్వం గౌడన్నలకు 500 కోట్ల విలువగల స్థలం కేటాయించడంతో పాటు 5కోట్లు నిధులు కేటాయించారని గుర్తుచేశారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగు రమేష్‌గౌడ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలను విలీన రాజుగా సర్వాయిపావన్న అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, అందరికీ ఆదర్శప్రాయుడు పావన్న అని గుర్తుచేశారు. ఆయన ఆశయాల సాధనకు గౌడ సంఘాలు కృషి చేయాలని సూచించారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం వరకు పావన్న చరిత్ర ఎవరికి తెలియదని, 2003 సంత్సరంలో భువనగిరి కొండపై పావన్న విగ్రహం పెట్టిన తర్వాత చరిత్ర బయటకు వస్తుందని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవృత్తులను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌దేనని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గౌడన్నల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీి ఏనుగు సుదర్శన్‌రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మెన్ పలుగుల మాధవరెడ్డి, సహకార సంఘం చైర్మెన్ సింగిరెడ్డి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దర్భదయాకర్ రెడ్డి, నక్క ప్రభాకర్‌గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బాలగోని బాలరాజ్‌గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, బీఆర్ఎన్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, మాజీ ఎంపీపీ బండారి దాసుగౌడ్, బీఆర్ఎన్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు బండారి శ్రీనివాన్గౌడ్, గౌడ బండారి ఆంజనేయులుగౌడ్ సంఘం సీనియర్ నాయకులు ఇరత ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.