Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాసగుప్త
నవతెలంగాణ-నాగోల్
చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలనుకున్న వారికి పేదరికం అడ్డు కాకూడదని, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్ మరియు ఐవీఎఫ్ జాతీయ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస గుప్తా అన్నారు. ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వరంగల్‌కు చెందిన ప్రణీత్ కుమార్‌కు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ముషీరాబాద్‌లోని వైశ్య బాలుర హాస్టల్లో ఉప్పల శ్రీనివాసగుప్త మరియు ఐవీఎఫ్ కార్యనిర్వహణ జాతీయ ఉపాధ్యక్షులు గంజి రాజమౌళి గుప్తలు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందు ఉండాలని ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని, ఇక ముందు కూడా అలాగే ఉండాలని అన్నారు. 33 జిల్లాల్లో ఐవిఎఫ్ని బలోపేతం చేసేందుకు యువత సన్నద్ధం కావాలని, ఆర్యవైశ్యులు కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రిలిమినరీ పాస్ అయి, ఐఎఎస్ చదువుతున్న 25మందికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని 33 జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అన్ని ప్రాంతాలలో, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు.పేద ఆర్యవైశ్యులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయా నంద్, ఐవిఎఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరి పబ్బ చంద్రశేఖర్, గౌర శ్రీనివాస్, గెల్లు రమేష్, ఐవిఎఫ్ అడ్వైజర్ సత్తయ్య, గౌరి శెట్టి చంద్రయ్య, కక్కిరాల రమేష్,-ఇంట ర్నేషనల్ వైశ్య ఫెడ రేషన్ జిల్లాల అధ్య క్షులు, కార్య దర్శులు, కోశాధి కారులు, ప్రతి నిధులు, కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.