Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
- జిట్ట క్రికెట్ టోర్నమెంట్
నవతెలంగాణ-జవహర్నగర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు, క్రీడా కారులకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్రం క్రీడలకు నిలయంగా మారిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరుకునేం దుకు సహకారం అందిస్తామని అన్నారు. ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 27వ డివిజన్ కార్పొరేటర్ జిట్ట శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ వ్యూ క్రికెట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జిట్ట క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం కాసేపు క్రికెట్ ఆడి అక్కడి క్రీడాకారులను ఉత్సాహపరి చారు.ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య క్రీడా నిర్వాహకులు కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి, శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు. బీఆర్ఎస్ జేఎమ్సీ అధ్య క్షుడు కొండల్ ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకా రులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతికి రావాలని మంత్రికి ఆహ్వానం
అంబేద్కర్ జయంతికి రావాలని కోరుతూ జవహర్నగర్ మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మండల సురేందర్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు. ఆదివారం మంత్రిని వారి నివాసంలో మహనీయుల కమిటీ సభ్యులు కలిసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యంగంతోనే ప్రతి ఒక్కరు స్వేచ్ఛాజీవులుగా బతుకున్నామని అన్నారు. మహార్యాలీ, బహిరంగ సభకు, జయంతి ఉత్సవాలకు వస్తా నని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ , కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, కొండల్ ముదిరాజ్, ఉత్సవ కమిటీ సభ్యులు పరుశురాం, బూడిద వెంకటేష్, శ్రీనివాస్, ఉపేందర్, పాల్గొన్నారు.