Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు అందజేత
నవతెలంగాణ-కంటోన్మెంట్
అన్ని పండుగలను గొప్పగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్లో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ముస్లీం లకు ప్రభుత్వం ప్రతి ఏటా అందించే రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే రంజాన్ సందర్బంగా పేద ముస్లీంలకు నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగకు పేద క్రిస్టియ న్లకు, బతుకమ్మ సందర్బంగా మహిళలకు చీరలను పంప ిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రంజాన్ సందర్బంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్తార్ విందు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నెల 12 వ తేదీన ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే ఇప్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని 6 డివిజన్లలో కూడా ఇప్తార్ విందు లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా మసీదులు, గ్రేవ్ యార్డ్ (కబరస్తాన్) ల అభివద్ధి కి కూడా పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తి లి అరుణ గౌడ్, ముస్లీం నాయకులు ఖలీల్, యాసిన్, ఫహీ ం, నోమాద్దిన్, అష్రఫ్, అఖిల్, అబ్బాస్ పాల్గొన్నారు.