Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ను తిట్టడానికే మోడీ వచ్చారా..?
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- గోల్నాక డివిజన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-అంబర్పేట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చకు సిద్ధమా ? అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఆదివారం అంబర ్పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరిగింది. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధానమంత్రి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు ఏం అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడ్డామో చెప్పా లని అన్నారు. ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేట ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు ఉండి అంబర్ పేటకు ఏం చేశారని.. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా ఉండి ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. అంబర్పేట లో ఎమ్మెల్యేగా ఒడినందునే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని.. బీఆర్ఎస్ పార్టీకికి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టడానికే మోడీ ఢిల్లీ నుంచి వచ్చారా? అని ప్రశ్నించారు. దేశంలో కేసీఆర్ను ఢ కొట్టే నాయకుడు లేరని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం మాని ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివద్ధి పనులు చేపట్టాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తు అన్ని పండుగలను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ మాత్రం మతాలు, కులాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని గమనిస్తు న్నారని, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పులిజాల గెలవయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ కుమార్ గౌడ్, లింగం గౌడ్,టీ పల్లవి, కొమ్ము శ్రీను, భూపతి లక్ష్మణ్, ఆర్కే బాబు, రేడపాక రాము, నల్లగొండ నరేందర్, బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.