Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బంజారాహిల్స్
స్టార్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వారు 5కే వాకథాన్ రన్ నిర్వహించారు. ఈ రన్లో కిడ్నీ వ్యాధిని జయించిన వాకితొ సహా వెయ్యి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. కిడ్నీ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా క్రానిక్ కిడ్నీ వ్యాధి నుంచి బయటపడిన వారు పాల్గొన్నారు. స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం మాట్లాడుతూ సమయం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శేషగిరిరావుకి తన హదయపూర్వక కతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఆయన భావితరానికి నిజమైన స్ఫూర్తిదాయకమన్నారు. కిడ్నీ సంరక్షణను ప్రోత్సహించే కారణానికి కమ్యూనిటీ వారి విపరీతమైన మద్దతు అవసర మన్నారు. అవయవ దానం ప్రాముఖ్యత గురించి అవగా హన కల్పించడం కూడా చాలా ముఖ్యం అని చెప్పారు. ఇది మన కమ్యూనిటీలలో సానుభూతి, కరుణ దాతత్వం ప్రాముఖ్యతను శక్తివంతమైన రిమైండర్‌గా కూడా పనిచే స్తుందని తెలిపారు. వాకథాన్ ఈవెంట్ తర్వాత, స్టార్ హాస్పి టల్స్ ఉచిత ఆరోగ్య పరీక్షలు అందించడం అభినంద నీయమన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించుకుని రోగ నిర్ధారణ జరిగిన తర్వాత వారికి 50 శాతం రాయితీతో వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్స్ ఎండీ, డాక్టర్ గోపీచంద్ మన్నం, జాయింట్ ఎండీ డాక్టర్ రమేష్ గూడపాటి,రిటైర్డ్ డీసీపీ బద్రీనాథ్ ఆర్ఎస్వి, తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణ ఈశ్వరగిరి, డాక్టర్ గందె శ్రీధర్, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ ఇతర వైద్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శతాధిక వద్ధుడు అప్పసాని శేషగిరిరావును స్టార్ హాస్పిటల్స్ ఘనంగా సన్మానించింది.