Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
సైకాలజిస్టులకు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హిమాయత్ నగర్ లోని ఎన్.సత్యనారా యణరెడ్డి భవన్ లో అసోసియేషన్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా సైకాలజిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ నాయకులు నాయ కత్వ లక్షణాలను మరింత మెరుగుపరుచుకుని సమాజానికి చేరువ కావాల్సిన అవసరముందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి సైకాలజిస్టులు ముందుండి తమ సత్తా చాటాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలోని సైకాలజిస్టులందరూ సంఘటితంగా పోరాటం చేస్తే సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటు సాధ్యమవుతుందన్నారు. ప్రతీ సైకాలజిస్ట్ నాయకత్వ లక్షణాలతో ఒక శక్తిగా ఎదగా లని ఇందుకు సంఘానికి దిన చర్యలో కొంత సమయాన్ని కేటాయించాలని కోరారు. ఇది తమ ఎదుగుదలకు తోడ్పడు తుందని సైకాలజిస్టులకు సూచించారు. సమజాంలో పెట్రేగిపోతున్న విపరీత ధోరణులపై వెంటనే ప్రతిఒక్క సైకాలజిస్ట్ స్పందించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నట్టు ఆయన పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ వై.శివరామప్రసాద్, కార్యదర్శిగా దేదీప్య, మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా అలియా పర్వీన్, కార్యదర్శిగా రాజు ఆచార్యలను ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్ర మంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జె.బాలసుబ్ర హ్మణ్యం, మోహన్ దేశ్ పాండే, వైదేహి, వనజా, సంతోష్ కుమార్, విజయరాణి తదితరులు పాల్గొన్నారు.