Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్వరూప్ సేవ సంస్థాన్ నేతృత్వంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం గాంధీజ్ఞాన మందిర్ యోగా కేంద్రం, శ్రీ అజిత్ పార్శ్య యువ అండ్ జూనియర్ సంఘటన్ సంయుక్తంగా స్వరూప్ సేవ సంస్థాన్ నేతృత్వంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో దాదాపు 300లకుపైగా హాజరై వైద్యప రీక్షలు చేయించుకున్నారు. తన తల్లి శాంతాబారు బాఫ్నా రెండో వర్థంతి నేపథ్యంలో కోఠీలోని గాంధీ జ్ఞాన మందిర్‌లో మెగా వైద్యం శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆ సంస్థ వ్యవస్థాపకులు, సామాజిక కార్యకర్త పదమ్ చంద్ బఫ్నా తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు వైద్య శిబిరం కొనసాగిందన్నారు.న మహావీర్ ఆస్పత్రి, సాధురామ్ ఐ ఆస్పత్రి(లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్) డాక్టర్లు పాల్గొన్నారని తెలిపారు. ఐ, డెంటల్‌తోపాటు ఫిజియోథెరిఫీ, పీడియాట్రిసియన్, జనరల్ ఫిజీషియన్లు, గైనాకాలజిస్ట్, ఆర్థోపెడిక్, కార్డియాకు సంబంధించిన వైద్య పరీక్షలు చేశారన్నారు. అవసరమైన వారికి ఈసీజీ, 2డీ ఎకో, బీఎండీ, ఆర్బీఎస్, బీపీ చెకప్ చేశామన్నారు. ఉచితంగా మందులను అందజేశామని తెలి పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశీష్ జైన్‌తోపాటు కన్వీ నర్లు షిల్కుమార్ జైన్, రితేష్ ముత్త, నిషాంత్ సమ్‌దారియా, ప్రణయ్‌తోపాటు కాలనీవాసులు, అపార్టుమెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.