Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలాజీనగర్ పరిధిలోని ఆంజనేయనగర్ కమ్యూనిటీ హాల్ నందు బాలాజినగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బాలాజీనగర్ డివిజన్ను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలి పారు. నియోజకవర్గంలోనే బాలాజీనగర్ పెద్ద డివిజన్ అని, బాబురావు పట్టు పట్టి నిధులు కేటాయింపు విష యంలో పట్టు వదలని విక్రమార్కుడిలా ఉండి డివిజన్ అబివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజ్, పార్కులు, గ్రేవ్ యార్డ్లు, మహిళా పార్కులు, స్కూల్స్ అభివద్ధి కొరకు వందలతో మంజూరు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలిసేటట్లు చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్ స్థలం కేటాయిస్తే అప్లై చేసిన 30 వేల ుందికి అంటే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించే బాధ్యత తీసుకుంటానని ఆయన తెలిపారు. బీజేపీకి గనక చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా పేదప్రజల కోసం స్థలం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కార్యదర్శి వెంకటేష్ చౌదరి, మహిళా అధ్యక్షురాలు అనితా శ్రీపాద , అరుణ శెట్టి, ఖైళా, బండి సుధ, డివిజన్ పరిశీలకులు సాయి బాబా, సీనియర్ నాయకులు కర్క పెంటయ్య, హరినాథ్, పవన్ కుమార్, లక్ష్మి నారాయణ, యాదగిరి, జిల్లా గోపాల్, సంతోష్ ,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.