Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే అన్నారు. దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, సమ సమాజ స్థాపనకు, మహిళా విద్య కోసం చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు జె.శ్రీనివాస రెడ్డి, కె.రాములు, జి.పర్వతం, మదన్ మోహన్ రావు, పి.నరసింహ రావు, యెస్ స్వామి రెడ్డి, జి.గోపాల్, చీఫ్ విజిలెన్సు ఆఫీసర్ కె.మురళీధర్ రావు, ఇతర అధికారులు పాల్గొని ఫూలేకు నివాళ్లర్పించారు.