Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం శ్రీ లక్ష్మీ దుర్గ భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తార్నాక డివిజన్లోని లాలాపేట్ లేబర్ అడ్డాలో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి సందర్శిం చారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా పాలసీ అందిస్తుందనీ, ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి దుర్గ భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ కమిటీ సభ్యులు మల్లెల శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.