Authorization
Sun April 06, 2025 09:53:54 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
చెరువుల సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం మూసాపేట్ మున్సిపల్ కార్యాలయంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో కాముని చెరువు, ముళ్ళ కత్వ, రంగాధముని చెరువుల అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ మమత, సర్కిల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు చెరువుల అభి వృద్ధికి సంబందించి ప్రణాళికలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.300 కోట్లతో చేపడుతున్న చెరువుల సుంద రీకరణ పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. ఈ కార్యక్ర మంలో డీసీ రవి కుమార్, ఎస్సీ చెన్నారెడ్డి, ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఎమ్మా ర్వో గోవర్ధన్, జీహెచ్ఎంసీ అధికారులు గోవర్ధన్ పాల్గొన్నారు.