Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
మండల పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో ఆదివారం జరిగిన హత్య కేసున మేడ్చల్ పోలీసులు చేదించారు. మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ సామల వెంకటరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఎల్లంపేట గ్రామ పరిధిలోని బనియన్ ట్రీలో మేనేజర్‌గా పని చేస్తున్న షేక్ చాంద్ (28) ఒడిశాలోని కెన్ ఫులియ,బడ్ బిల్లా మయూర్ బంజ్కు చెందిన దారిత్రి సింగ్ (22)ను నెల రోజుల క్రితం అక్కడి నుంచి తీసుకువచ్చి డబిల్ పూర్ గ్రామంలో ఒక ఇల్లు కిరాయికి తీసుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తను గర్భం దాల్చి షేక్ చాంద్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలిసి భార్యాభర్తలు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ధరిత్రి సింగ్‌ను తన భర్త నుండి దూరం చేయాలని ఉద్దేశంతో షేక్ చాంద్ భార్య పంకిజ తనకు తెలిసిన వ్యక్తులైన అజింషా (22), మందాకిని(22) సహాయం కోరగా వారు అందుకు ఒప్పుకున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో ధరిత్రి సింగ్ ఉంటున్న ఇంటికి అజింషా, మందాకిని ఇద్దరు స్కూటీపై వెళ్లి మందాకిని ఎవరు ఇంట్లోకి రాకుండా బయట కాపలా ఉండగా అజింషా ధరిత్రి సింగ్ చేతులను వెనుకకు కట్టేసి టవల్ తో గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు.కాగా విచారణ పూర్తయినందున నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్టుగా తెలిపారు.
పోలసుల అదపులో డ్రైవర్
ఇంటి యజమాని తాళం పగలగొట్టి సుమారు 11 తులాల బంగారాన్ని దోచుకెళ్లిన కారు డ్రైవర్ గ్యారా రమేష్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు మేడ్చల్ జోన్ ఏసీపీ సామల వెంకటరెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గౌడవెళ్లి గ్రామ పరిధిలోని సాకేత్ విల్లాసులో ఉంటున్న బియస్ యన్ ఎల్ విశ్రాంత ఉద్యోగి ఈనెల 8వ తేదీన వారి స్వగ్రామం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరాణాలు చోరికి గురయ్యాయని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన మేడ్చల్ పోలీసులు ఇంటి యజమాని లేని సమయంలో విల్లాలోకి ఎవరు ఎవరు వచ్చారని విచారణ చేసి సిసి ఫుటేజ్ ఆదారంగా దొంగను గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిందితుడు గ్యారా రమేష్ ఇంటి యజమాని వద్దే కారు డ్రైవరుగా తోట మాలిగా పని చేస్తు అదను చూసుకొని దొంగతనం చేశానని ఒప్పకొన్నాడని విచారణలో తెలిపినట్లు ఏసిపి చెప్పారు. నిందితుడు గ్యారా రమేష్ వద్ద నుండి 107.7 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకున్నట్లు ఏసిపి వెల్లడించారు. ఈ సందర్భంగా కేసును చేదించిన పోలీసులకు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ రెడ్డి,డ ిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్రసాద్, ఎస్సైలు నర్సింహ గౌడ్, సత్యనారాయణ, రఘురాం, ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.