Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పోరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నవతెలంగాణ-నాచారం
నాచారం డివిజన్ పరిధిలోని నాచారం ఓల్డ్ విలేజిలో నెలకొన్న డ్రయి నేజీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తెలిపారు. మంగళవారం నాచారం ఓల్డ్ విలేజ్ భర్త సమాజం సమీపంలో డ్రయినేజీ పొంగిపొర్లుతుందని స్థానికులు తెలిపిన ఫిర్యాదు మేరకు సీవరేజ్ సూపర్వైజర్ రాకేష్తో కలిసి పర్యటించి డ్రయినేజీ సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ తక్షణమే డ్రయినేజీ సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. నాచారం ఓల్డ్ విలేజిలో భూగర్భ డ్రయినేజీ నిర్మాణం చేసేంతవరకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం నాచారం సీనియర్ సిటిజన్ అసోస ియేషన్ ప్రతినిధులు కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు ప్రేమ్ కుమార్, సాయి బాబా, ఎల్లేష్, బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చి గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.