Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాల్టీ రాంపల్లి గ్రామంలోని పీర్ల కొట్టం దగ్గర రోడ్డు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కీసర సహకార సొసైటీ మాజీ వైస్ చైర్మెన్ రామరం నర్సింహ్మ గౌడ్ అన్నారు. మంగళవారం మున్సిపల్ చైర్మెన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ వాణిరెడ్డిలకు వారు ఫిర్యాదు చేశారు. పీర్ల కొట్టం దగ్గర ప్రతి ఏటా దసరా పండుగ నాడు రావణ దహనం పెద్ద ఎత్తున గ్రామస్తులు నిర్వహిస్తారని రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారని చైర్మెన్ , కమిషనర్ లకు తెలియజేశారు. ఈ మేరకు చైర్మెన్ , కమిషనర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంటి నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి పనులు నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చారు.