Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
బండ చెరువును జీహెచ్ఎంసి ఎంటమాలజి అధికారుల బృందం మంగళ వారం సందర్శించింది. బండ చెరువులో గుర్రపు డెక్క వలన దోమల బెడద ఎక్కువైందని వినాయక్‌నగర్ కార్పొరే టర్ క్యానం రాజ్యలక్ష్మి జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్, మేయర్ విజయలక్ష్మికి వినతి పత్రం అందజేసిన సంగతి తెలిసిందే. అందుకు స్పందించిన ఎంటమాలజీ అధికారుల బృందం బండచెరువును సందర్శిం చి పరిష్కార మార్గాలను ఆలోచించారు. చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, సూపర్వైజర్లు రామచందర్, గురుభూషణ్ బండ చెరువు దగ్గరకు వచ్చి పరిష్కార మార్గాలను చర్చించారు. వెంటనే చెరువులో రెండు హిటాచి మిషన్లను, ఒక జెసీబీని పెట్టి గుర్రపు డెక్కను తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చెరువుని వీక్షించిన చీఫ్ ఎంటమాలజిస్ట్ చెరువు పరిస్థితిని చూసి, అక్కడ కావలసిన ఎస్టిపి ప్లాంట్ గురించి, చెరువు క్లీనింగ్ గురించి కమిషనర్‌తో చర్చిస్తానని చెప్పారు. కరాటే మహేష్ , ప్రెసిడెంట్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.