Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం అనితారెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మల్లాపూర్ చౌరస్తాలో డీఎస్పీ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎడ్ల పరమేష్ ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్లను 27 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీల జనగణ ప్రకారం రాబో యే ఎన్నికల్లో 60 నుంచి 70 శాతం బీసీలను చట్టసభల్లోకి పంపించేందుకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే ప్రకటించి గడిచిన ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డలకు టిక్కెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ కమిషనర్, కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా పాల్గొని సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఇన్చార్జి గౌడ సుదర్శన్, సుల్తాన్, రఘు, రవీందర్ నాయక్, మల్లేష్, అంబేడ్కర్, శ్రీహరి, జ్ఞానేశ్వర్, దాసరి రాధా ముదిరాజ్, ప్రవీణ్, అంజి, శివ కష్ణ, మంగ, ప్రభాకర్, సుమన్, సురేష్, ప్రశాంత్, భూపతి వేణు, శాంతమ్మ, ప్రేమలత, స్నేహ తదితరులు పాల్గొన్నారు.