Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా సైనిక్ పురి చౌరస్తాలో ''సామాజిక చైతన్యానికి విద్య ఆవశ్యకత'' అనే అంశంపై సదస్సు జరిగింది. ప్రముఖ విద్యావేత్త కంచె ఐలయ్య , టీపీఎస్ కే కన్వీనర్ జీ రాములు , ప్రముఖ రచయిత్రి జ్యోతి, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఈఆర్‌పీఎస్ నాయకులు సీహెచ్ నాగేశ్వరరావు, ప్రముఖ సామాజిక నాయకులు ప్రసాద్ బాబు ప్రసంగించారు. సదస్సుకు ముందు ఫూలే విగ్రహానికి కంచె ఐలయ్య , ఆహ్వానితులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళ్లర్పిం చారు. ఈ సదస్సుకు స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్ష వహించారు. సదస్సుకు ప్రారంభ సూచికగా గురజాడ అప్పారావు దేశభక్తి గీతం ప్రారంభ గీతంగా స్ఫూర్తి గ్రూపు బాధ్యులు ఆలపించారు. అనంత రం కంచె ఐలయ్య మాట్లాడుతూ '1820 నాటికి శూద్రులకు చదువు నిషేధించారు. ఈ క్రమంలో ఫూలేను ఆయన తండ్రి ఏడవ తరగతిలోనే చదువు మాన్పించారు. బాల్య వివాహం కూడా ఆయనకు జరిగింది. అయితే చిన్నతనంలో ఉన్నప్పటికీ ఆయన తన భార్యకు చదువు చెప్పి తీర్చి దిద్దిన సందర్భం అది. అంతేకాదు ఆడపిల్లకు చదువు చెప్పటం అరిష్టం అంటూ కొందరు అతని తండ్రికి చెప్పి మాన్పిం చాలని ప్రయత్నించినప్పుడు, జ్యోతిరావు ఫూలే, భార్య సావిత్రిబాయి ఫూలే ఇద్దరూ కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చి పూల వ్యాపారం చేశారు. విద్య ఆవశ్యకతను అర్థం చేసుకొని తాను పాఠశాలలు పెట్టడమే కాకుండా మహిళ టీచర్‌గా సావిత్రిబాయి పూలేని తయారుచేసి నిమ్న కులాల బాలికలకు పాఠశాలలో పెట్టి చదివించారు. అనంతరం ప్రజా చైతన్యం కి తమ వంతు కృషి చేస్తామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు' అని తెలిపారు. ప్రముఖ రచయిత్రి జ్యోతి మాట్లాడుతూ విద్యాధి కులుగా ఉన్నవారు కూడా మూఢనమ్మకాల్లో పోతున్నారని, దానికి వ్యతిరేకంగా నిలబడాలని కోరారు. నాగేశ్వరావు ప్రసాద్ బాబు, శ్రీమన్నారాయణ, నాగయ్య, స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు, సమాచార హక్కు సాధన నాయకులు గగన్ కుమార్ ,ఈసీఐఎల్ డివిజన్ హెడ్, ఓబీసీ నాయకులు శ్రీనివాస్ , కృపా సాగర్, తాడూరి శ్రీనివాస్ , వెంకటసుబ్బయ్య , బీడీఎల్ విజరు కుమార్ ప్రముఖ లాయర్ ప్రభుదాసు, ట్రేడ్ యూనియన్ నాయకుల అశోక్ తదితరులు ప్రసంగించారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు జి శివరామకృష్ణ వందన సమర్పణ చేశారు. సమావేశంలో ఆర్ఎస్ఆర్ ప్రసాద్ , బసవ పున్నయ్య , వెంకట్ , కోమటి రవి , కొత్త రామారావు, పూలే విగ్రహం నిర్వహణ నాయకులు, ప్రముఖ లాయర్ భాస్కర్, వంశ రాజ్ మల్లేష్, నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్, ఉన్నికష్ణ, మహిళా సంఘం నాయ కులు చల్లా లీలావతి, శారద, స్ఫూర్తి గ్రూప్ నాయకులు పాషా పాల్గొన్నారు.