Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-ఓయూ
ప్రతి తెలంగాణ బిడ్డ ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యావకాశాలను కల్పిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించార ని గుర్తు చేశారు. విభిన్న రంగాల్లో ఆణిముత్యాలను అంది ంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్ని విధా లుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ వసతిగృహ సముదాయానికి హౌంశాఖ మంత్రి మహమూద్ ఆలీతో కలిసి మంగళవారం శంకు స్థాపన చేశారు. రూ.39.50 కోట్లతో 500 మంది విద్యారు ్థలకు సరిపోయేలా హాస్టల్ భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగానికి ఏటికేడు బడ్జెట్లో నిధులు పెంచుతున్నారని హౌంశాఖ మాత్యులు మహమూద్ ఆలీ అన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మౌళిక వసతుల కల్పన కోసం రూ.113 కోట్లతో ఓయూలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరిం చారు. విద్యారంగంలో మౌళిక వసతుల కల్పన కోసం విద్యాశాఖ మంత్రి కష్టపడి పని చేస్తున్నారని ప్రశం సించారు. ఓయూలో ఏడాది వ్యవధిలో ఎప్పుడూ లేని విధంగా పెద్దఎత్తున మౌళిక వసతుల కల్పన జరుగు తోందని ఓయూ వీసీ ప్రొ.రవీందర్ వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సముచిత నిధులు సమకూరుస్తోందన్నారు. గిరిజన సంక్షేమశాఖ నుంచి మరో రెండు విద్యార్థుల వసతి గృహాల నిర్మాణం కోసం రూ.40 కోట్లు మంజూరు అయ్యాయనీ, త్వరలోనే పనులు ప్రారం భిస్తామని వివరించారు. అనంతరం ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్ నిర్వహిస్తున్న మహనీ యుల జయంతి ఉత్సావాల పోస్టర్‌ను మంత్రులు ఆవిష్క రించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రావు ల శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి, రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీనారాయణ, ఇంజినీరిం గ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరాం వెంకటేశ్, ప్రొ.జి.మల్లేశం, ప్రొ.మంగు, ప్రొఫెసర్ నవీన్, డాక్టర్ చలమల్ల వెంకటేశ్వ ర్లు ఆయా విభాగాల డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.