Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం అంబర్ పేట డివిజన్ పరిధిలోని ఓవైసీ నగర్ మసీద్ ఈ లతీఫా వద్ద రంజాన్ తోఫాలను అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాదీ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలకు కానుకలను ఇస్తుందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో కానుకలను అందిస్తున్నామని తెలిపారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మసీదు కమిటీ పెద్దలు ఖలీల్, బాబా బాయ్, జమీల్, మొయిన్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్, అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, అతిక్, సలీం, రఫిక్, జమీల్, మహేష్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, హైమద్, తదితరులు పాల్గొన్నారు.