Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పేదలకు నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు ఉపాథి కల్పించడమే లక్ష్యంగా పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ పని చేస్తోందని పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు సమీపంలో జీజీ హాస్పిటల్ ట్రస్ట్ సహ కారంతో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ వారం హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఒక్క రూపాయికే ఓపీ సేవలు అందించడంతో పాటు డయాగస్టిక్స్పై 50 శాతం, మందుల కొనుగోలుపై 20 నుంచి 50 శాతం వరకూ రాయితీ ఇవ్వనున్నట్టు చెప్పారు. పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్, గైనకాలజీ, చిల్డ్రన్ స్పెషలిస్ట్, జనరల్ సర్జన్‌తోపాటు అన్ని రకాల వైద్య సేవ లు అందుబాటులో ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి, వైజాగ్ ప్రాంతాల్లో కూడా రూ.1కే ఓపీ సేవలను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవిచారి, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ, బీఆర్ఎస్ గ్రేటర్ నాయకులు ఎమ్మెన్ శ్రీని వాస్, బీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రావులపాటి మోజన్లు పాల్గొని అభినందనలు తెలియజేశారు. రాకేష్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ పైడి సుచరిత రెడ్డి, జీజీ చారిటీ హాస్పిటల్ చైర్మన్ గంగాధర్‌గుప్తా,తదితరులు పాల్గొన్నారు.