Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్దార్ పటేల్ నగర్ ప్రధాన రహదారి
పక్క సందులో సంచిలో శవం
నవతెలంగాణ- బడంగ్పేట్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం జోన్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హార్డ్వేర్ పార్క్ సర్దార్ నగర్ గేట్ సమీపంలో సుమారు 30 నుండి 35 సంవత్సరాల మహిళ మృతదేహం ఒక సంచిలో మూటకట్టి పడేసి వెళ్లిన సంఘటన పVహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం రేపుతోంది. మహేశ్వరం జోన్ డిసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్దార్ పటేల్ నగర్ ప్రధాన రహదారి పక్కన సంచి నుండి భరించలేని దుర్వాసన రావటం గమనించిన స్థానికులు 100కు డయల్ చేశారు. సమాచారం అందు కున్న పోలీసులు వెంటనే ఏసీపీ అంజయ్య ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, సిబ్బందితోపాటు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పడేసిన యూరియా సంచి విప్పి చూడగా అందులో 30 నుంచి 35 మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎరుపు రంగు చీర,మెడకు బిగించిన టవల్,చెప్పులు సంచిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. నాలుక బయటకు రావటంతో టవల్ తో బిగించి హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యం కావడంతో హత్య చేసి 3 రోజులు అయ్యి ఉండ వచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి బుధవారం తెల్లవార జామున వాహనంపై మూటలో శవాన్ని తీసుకువచ్చి ఇక్కడ పడవేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు ముందు ఆమైపై లైంగికదాడికి పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా 3,4రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో ఏదైనా మిస్సింగ్ కేసు నమోదు అయ్యిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ లభిస్తే హత్య మిస్టరీ వెలుగులోకి వస్తుందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసును పహడి షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడలో పసుపు కలర్ తాడు,చేతి కి రెడ్ కలర్ గాజులు,చేతులకు ఉంగరాలు,పసుపు కలర్ జాకెట్, చాకలెట్ కలర్ లంగా,రెడ్ కలర్ చీర,బ్లాక్ రెడ్ కలర్ చెప్పులు ధరించి ఉంది.