Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సరూర్ నగర్
వేసవి కాలంలో దాహార్తిని తీర్చుకునేందుకు నీళ్లు దొరక్క ఆగ్రహావేశాలకు లోనై మనుషులు మీద దాడులు చేస్తున్న కుక్కలు లాంటి వీధి జంతువుల దాహం తీర్చేం దుకు జాగతి అభ్యుదయ సంఘం, శ్రీ షిర్డి సాయి అష్టాంగ యోగ శిక్షణా కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మట్టితో చేసిన నీటి తొట్టెలతోపాటు పిచ్చుకల సంరక్షణా గూళ్లుఉచితంగా పంపిణీ చేశారు. లోటస్ ల్యాప్ స్కూల్ వేదికగా నిర్వహిం చిన కార్యక్రమానికి అతిథులుగా స్కూల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ యోగా గురువులు సిద్ధిరాజ్ తపోదనగిరి స్వామిజి, మంజు ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ చైర్మెన్ మంజులా రెడ్డిలు హాజరైనారు. యోగ కేంద్రం గురువు ఇస్మాయిల్ మాట్లాడుతూ ప్రకతిని ని ప్రేమించండి, పోషించండి అం టూ శిక్షకులతో నినాదాలు చేయించారు. పర్యావరణ రక్షణ లో భాగంగా పొల్యూషన్ కారకమైనటువంటి వాహనాలు వాడకూడదని, బ్యాటరీతో నడిచే వాహనాన్ని వాడాలని, శ్రీ ఇస్మాయిల్ గురూజీ ఆచరణాత్మకమైన జీవితం ఉండాలని భావనతో ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ బైక్ ను స్వామీజీ చేతుల మీదుగా తీసుకున్నారు. ప్రతీ ఒక్కరు వ్యక్తిగత బాధ్య తతో పర్యావరణాన్ని కాపాడుకోవడం దినచర్యలో భాగం చేసుకోవాలని, భావితరాలకు ఒక మంచి ఆహ్లాదానుభూతిని పంచే ఆకుపచ్చని సమాజాన్ని నిర్మించుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో గోపాల్ దాస్ రాము, యాదా రామలింగేశ్వరరావు, ఓబులేష్ యాదవ్, కవితా గోపాల్ రెడ్డి, నంబూరు తాతయ్య, వెంకట్ నారాయణ, యోగ శిక్షకులు, ఎల్ ఎస్ ఎన్ రెడ్డి వేణు లు పాల్గొన్నారు.