Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
అగ్గిపడితే కంపెనీ బుగ్గిపాలైనట్లే.. మల్లాపూర్ పారిశ్రామిక వాడలోని జిపి ఇండిస్టిస్ ఎనమిళ పెయింట్స్ కంపెనీలో బుధవారం సాయంత్రం పని చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ ఆస్తి నష్టం భారీగా సంభవించినట్లు సమాచారం. గతంలో జీపీ ఇండిస్టీస్ ఎనమిళ పెయింట్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు యూనిట్ మొత్తం బాయిలర్లు పూర్తిగా ఖాళీ బూడిద మిగిలింది. అయినా కంపెనీ యజమాని సంతోష్ కుమార్ భద్రత ప్రమాణాలు పాటించకపోవడమే మళ్లీ అగ్ని ప్రమాదానికి కారణమని సంఘటన జరిగిన తీరును బట్టి ఫైర్ అధికారులు, పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. అసలే మండుటెండలు ఆపై పెయింట్ కంపెనీ కావడంతో యాజమాన్యం భద్రతా ప్రమాణాలను సమకూర్చకపోవడం ఒక కారణమైతే కంపెనీలు పనిచేస్తున్న కార్మికుల నిర్లక్ష్యం తోడైతే నిలువునా అగ్నికి ఆహుతి అయ్యింది. కోట్ల రూపాయల ఆస్తి కాలి బూడిద అయినా నిర్లక్ష్యం వీడక నిరాశ్రయలవుతున్నారు. ఎండాకాలం వస్తే ఏ వైపు నుంచి మంటలు ఎగిసిపడతాయని అటు కార్మికులు ఇటు సమీప నివాస ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారు.
ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.....
దట్టమైన పొగలు, ఎగిసిపడుతున్న అగ్ని కిలాలతో సమీపంలో నివాసముంటున్న బాబా నగర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తమైన రక్షణ అధికారులు ఇండ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పెయింట్ లిక్విడ్ కావడంతో మంటలు అదుపు చేయడం కష్టతరంగా మారుతుందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. గతంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సుమారు మూడు రోజులపాటు శ్రమించిన మంటలు పూర్తిగా అదుపు చేయడం కష్టమైందని ఫైర్ అధికారులు వెల్లడించారు. మంట అధికమవుతున్న కొద్ది పొగతో పాటు అగ్ని కిలలు సుడులు తిరుగుతూ ఎగిసిపడ్డాయి. ఆరు ఫైర్ ఇంజన్లు, ఫోమ్ అధునాతన యంత్రం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నంలో నిమగమయ్యారు. అయినా ఎగిసిపడుతున్న అగ్ని కీలలు అదుపు అదుపు చేయడంలో ప్రాణాలను తెగించి శ్రమించారు. ఫైర్ సిబ్బంది. ఫైర్ ఇంజన్లకు వాటర్ అందించడం కోసం జలమండలి ఎండి దాన కిషోర్ తో మాట్లాడి అవసర మైనంత నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇన్సూరెన్స్ కోసం చేసి ఉండొచ్చని అనుమానం..!
ఏడేండ్ల క్రితం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలోని యంత్రాలు, ముడి సరుకు ఉత్పత్తి నిలువలు పూర్తిగా ఖాళీ బూడిద కావడంతో కోట్లలో నష్టం వాటిల్లిందని కంపెనీ యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీలను ఆశ్రయించి క్లైమ్ చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో పెయింట్ కంపెనీల ఉత్పత్తులు క్రమక్ర మంగా దిగజారుతున్న క్రమంలో జీపీ ఇండిస్టీస్ యాజమాన్యం వేసవి కాలాన్ని అదునుగా భావించి ఇన్సూరెన్స్ కోసం ఇటువంటి ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంఘటన స్థలాన్ని సందర్శించిన సీపీ డీఎస్ చౌహన్.
సంఘటన సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ జానకి రమావత్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది భద్రతను కల్పిస్తూ ప్రజలను పరిసర ప్రాంతాలకు రానీయకుండా గట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీప పరిశ్రమలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు చుట్టుపక్కల కాలనీ ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా అప్రమతమై సురక్షిత ప్రాంతాలకు తరలించారు.