Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించి, ఓటరు జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి ధ్రువీకరించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి మేడ్చల్ అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున ా్నమని తెలిపారు. జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, వివరాలు రెండుమార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి తొలిగిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయో లేదో పరిశీలించి, ఏమాత్రం లోపాలకు తావులేకండా అప్డేట్ చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు, పకడ్బంధీగా ఉండేలా అధికారులు, సిబ్బందితో పనులు జరుగుతున్నాయన్నారు. ఏమాత్రం లోపాలకు తావులేకుండా చర్యలు చేపడు తున్నామని అదనపు కలెక్టర్ వివరించారు.