Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెయింట్ పౌయిస్, హౌలీ మేరి స్కూల్లో ఏర్పాట్లు
- జిల్లాకు చేరిన 3.66 లక్షల జవాబు పత్రాలు
- 'స్పాట్' విధుల్లో 1600 మంది ఉపాధ్యాయులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేటి నుంచి హైదరాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్ష పత్రాల మ్యూలాంకనం నిర్వహించనున్నారు. నగరంలోని సెయిం ట్ పౌయిస్ ఉన్నత పాఠశాలలో (మేజర్ క్యాంపు), ఏసీ గార్డ్‌లోని హౌలీ మేరి ఉన్నత పాఠశాలలో (మైనర్ క్యాంపు) ఈ నెల 21వ తేదీ వరకు స్పాట్ వ్యాలూవేషన్ జరగనుంది. ఇందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరీ ముఖ్యంగా పది ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో స్పాట్ వాల్యూవేషన్‌పై అధికా రులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని 22 జిల్లాలకు చెందిన మేజర్, మైనర్ క్యాంపునకు సంబంధించి 3.66 లక్షల జవాబుపత్రాలు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరాయి. స్పాట్ వాల్యూవేషన్ కోసం 1608 మందికి విధులు కేటాయించగా.. ఇందులో మేజర్ క్యాంపునకు చీఫ్ ఎగ్జామినర్లు 123, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 736, స్పెషల్ అసిస్టెంట్లు 246 మంది ఉంటారు. ఇక మైనర్ క్యాంపులో చీఫ్ ఎగ్జామినర్లు 68, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 299, స్పెషల్ అసిస్టెంట్లు 136 మంది ఉంటారు.
పకడ్బందీగా ఏర్పాట్లు..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలైన తొలిరోజుతో పాటు ఆ తర్వాత రోజు ప్రశ్నాపత్రాలు లీకేజీ వార్తలు కలకలం సృష్టించిన నేపథ్యంలో జిల్లాలోని స్పాట్ వాల్యూవేషన్ కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పాట్ వాల్యూవేషన్ కేంద్రాలైన సెయింట్ పౌయిస్, హౌలీ మేరి స్కూల్ వద్ద గట్టి నిఘా పెట్టారు. టెన్త్ జవాబుపత్రాల వాల్యూవేషన్ సందర్భంగా సెంటర్ సమీపంలోకి ఎవరినీ అనుమతించకుండా చర్యలు తీసుకొనున్నా రు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు క్యాంప్ ఉంటుందనీ, ఒక్కొ ఉపాధ్యాయుడికి రోజుకు 40 జవాబుపత్రాలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. అలాగే స్పాట్ కేంద్రంలోకి సెల్ఫోన్లు అనుమతి లేదనీ, ఆదివారాల్లోనూ కొనసాగుతుందని అధికారులు చెప్పారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. పొరబాట్లు జరిగితే సంబంధింత అధికారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని డీఈఓ రోహిణి తెలిపారు. ఎక్కడైనా అసౌకర్యానికి గురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.