Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దార్శనికత వల్లనే నేడు దళిత, గిరిజన, బహు జన వర్గాలతోపాటు సకల జనులకు ఆర్థిక, సామాజిక న్యాయం లభించిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిది óలో బుధవారం తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నేడు దేశంలో మనందరం ఈ విధంగా జీవిస్తున్నామంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలాలేనని, నేడు మేము ఎంతో గౌరవప్రదమైన పదవులు పొందడం కూడా ఆయన రాసిన రాజ్యాంగం వల్లనేనని ఆయన అన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, దానికి ముందు బాలానగర్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. విగ్రహ దాత సుదీప్ పటేల్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అదిముల రాము, ప్రధాన కార్యదర్శి ఎస్ కె శ్రీనివాస్, అశోక్ కుమార్, ముఖ్య సలహాదారు నల్ల విల్సన్, కార్యదర్శి ఎస్.కే శ్రీని వాస్, కోశాధికారి మెడి అశోక్, ఎక్సాఫీసియో సభ్యుడు ఎడ్ల ప్రభాకర్, గౌరవ అధ్యక్షలు మహంకాళి శివశంకర్, కార్యని ర్వహక అధ్యక్షుడు కలమురి శ్రీనివాస్ రావు, మీడియా సెక్రె టరీ చింత నర్సింగ్ రావు, మీడియా ప్రతినిధి రవి స్టీవెన్స న్, సలహాదారులు జెరుపోతుల రవీందర్ రావు, ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్‌గౌడ్, ఏన్.వి రత్నం, మల్లిగరి లక్ష్మీనారా యణ, మదాసు నర్సిం హలు, ఏన్.పి.లక్ష్మణ రావు, ఉపా ధ్యక్షులు మహంకాళి సూర్యనారాయణ, రమేష్, దండు రవికుమార్, హౌలియ దాసరి సంక్షేమ సంగం అధ్యక్షులు అదిముల నగేష్, కార్యదర్శి శ్రీకాంత్, ఎక్స్ఫీసియో సభ్యుడు ఆదిముల వెంకటేష్, దళిత మహిళ నాయకురాలు ఎడ్ల కవిత, మల్లిగారి భారతి, దీప్తి, సుంకె సరోజ పాల్గొన్నారు.