Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రతినిధి కొలను హనుమంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, రంగారెడ్డి నగర్ డివిజన్, పరిధి ఛత్రపతి శివాజీ విగ్రహం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి చెన్నరెడ్డి నగర్, పంచశీల కాలనీల్లో 'గడప గడపకు హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర'( 57వ రోజు )చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కరపత్రాలను అందజేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల ద్వందనీతిని, అధికారం కోసం మోసపూరిత హామీలతో ప్రజలకు జరిగిన అన్యాయ ం గురించి వివరిస్తూ.. ప్రజలను చైతన్యవంతులను చేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించా లని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ. 5లక్షలతో పేదవాడి సొంతి ంటి కల నిజం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి సువ్వారి శ్రీనివాస్, మేకల ఎల్లయ్య, ,ఐ.ఎన్.టి. యూ.సి కార్మిక నాయకులు అమర్ బాబు, మాజీ వార్డు సభ్యులు బి.శివ కుమార్,టి. శ్రీనివాస్, హమ్మి రెడ్డి, గురువా రెడ్డి, శ్యామ్, ఎం.డి అజీమ్ ఉద్దీన్, నిజాముద్దీన్, ప్రవీణ్,రాజ శేఖర్‌రెడ్డి, హరీష్, డోరా అరుణ్, రాంచందర్, గురువారెడ్డి, సతీష్, పుల్లారెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, గణేష్, ఎండీ అంజాద్, ఎం.డి నయీ మ్ పాషా, గురుమూర్తి, శివ, రాహుల్, చల్లా, ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ ముదిరాజ్, మహిళా నాయకు రాళ్లు కౌసల్య, లలిత, యాదమ్మ, గౌసియా, హసీనా, కుమారి పాల్గొన్నారు.