Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిపాలనా విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తోంది. ఆ విభాగంలో జేసీ చెప్పిందే వేదం. సర్కార్ ఆదేశాలను పట్టించుకోరు. కమిషనర్ నిర్ణయాలను ఖాతర్ చేయరు. ప్రమోషన్ల విషయంలో కమిషనర్ ఆదేశాలను పట్టించుకోకపోవడ మే ఇందుకు నిదర్శనం. ప్రమోషన్ల విషయంలో ఓ వ్యక్తికి అను కూలంగా వ్యవహరించారని రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసినా సదరు ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోపాటు మెమో టాంపరింగ్ విషయంలో రెండేండ్లుగా ఫైల్‌ను పెండిం గ్లో పెట్టిన క్లర్క్ రఘుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వంటి చర్యలను ఆ విభాగం జేసీ, ఏసీలు సమర్థించుకోవడంతో పాటు సర్కార్‌ను, జీహెచ్ఎంసీని తప్పుదోవపట్టిస్తున్న పరిపాలనా విభాగంపై కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
సర్కార్ ఆదేశాలు బేఖాతర్
జనరల్ బ్రాంచిలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి అర్హత లేకున్నా ప్రమోషన్ ఇచ్చిన విషయంలో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి సీనియర్ అసిస్టెంట్‌పై ప్రభుత్వం 24 ఆగష్టు2021న మెమో జారీ చేసింది. దీనిపై పూర్తిస్తాయి నివేదిక పంపించాలని కోరింది. ఈ విషయంలో కమిషనర్ సైతం సీరియస్ అయ్యారు. సీనియర్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సదరు వ్యక్తిని బదిలీ చేశారు. ఈ విషయంలో పరిపాలనా విభాగం ఏసీ, జేసీ కమిషనర్‌ను తప్పుదోవ పట్టించారనే విమర్శలూ లేకపోలేదు.
డిజిటల్ కీ
'నేను జాయింట్ కమిషనర్‌ను. జీహెచ్ఎంసీ అంతా నా చేతిలోనే నడుస్తోంది. పైగా నేను ఎల్ఎల్బీ చేశాను. అన్ని చట్టప రమైన అంశాలపై నాకు పట్టుంది. కమిషనర్, అడిషనల్ కమిష నర్ (పరిపాలన) సైతం నా దగ్గర సలహాలు తీసుకుంటా రు. పరిపాలనా విభాగంలో నాతోపాటు సీనియర్ సూపరింటెం డెంట్ కూడా ఎల్ఎల్బీ చేశాడు. మేమిద్దరమే ఈ విభాగాన్ని నడిపిస్తు న్నాం' అంటూ ఉద్యోగులను ఎల్బీనగర్ ఏఎంసీ, ఇన్ చార్జి జేసీ భయపెడుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అయితే ఏఎంసీగా ఉన్న వ్యక్తి జేసీగా చలామణి అవుతు న్నారు. పైగా ఏఎంసీ పేరుతో ఉండాల్సిన డిజిటల్ కీని సైతం జేసీ పేరు తో తీసుకున్నారు. దీనికి ఏసీ అండదండలున్నాయని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. కానీ ఏఎంసీ నుంచి జేసీగా ప్రమోషన్ రావాలంటే సీడీఎంఏ నుంచి అనుమతి తప్పని సరిగా ఉండాలనీ, అది లేకుండా ఆయనే మూడేండ్లుగా ప్రకటించుకోవడం సరికాద ని సీనియర్ ఉద్యోగులు అభిప్రాయపడు తున్నారు.
ఈ వార్తలు మనల్నేం చేస్తరు
జీహెచ్ఎంసీ వివాదాలకు నిలయంగా మారింది. నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విచారణ జరుగుతుండగానే పదో తరగతి మార్కుల మెమోను టాంపరింగ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన విషయం దుమారం రేపుతోంది. దీన్ని విజిలెన్స్ విచార ణకు ఫైల్ పంపకుండా పరిపాలనా విభాగం ఏసీ, జేసీ తాత్సారం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై నవతెలంగాణలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. 'ఎన్ని వార్తలు వచ్చినా మనకేం కాదు. నేనున్నా కదా జేసీగా చూసుకోవడానికి' అంటూ సదరు క్లర్క్‌తో అన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా టాంపరింగ్‌పై ఇంత చర్చ జరుగుతున్నా జీహెచ్ఎంసీ కమిషనర్ పట్టించుకోపోవడం విడ్డూరంగా ఉందనీ, ఇప్పటికైనా కమిషనర్ స్పందించి పరిపాలనా విభాగంలోని అవినీతి పరులైన ఆ ముగ్గురిపైనా చర్యలు తీసుకోవడంతోపాటు ఆ విభాగం నుంచి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మంత్రి కేటీఆర్‌ను కలుస్తామనీ, అవసరమైతే ప్రగతిభవన్, జీహెచ్ఎంసీ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని యూనియన్ నేతలు, ఉద్యో గులు హెచ్చరిస్తున్నారు. టాంపరింగ్ కేసుపై జీహెచ్ఎంసీ విజిలె న్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయనీ, అందుకు ఆ విభాగం లో జేసీ అనుచరులు ఉన్నారనీ, వాళ్లే ఫైల్‌ను తొక్కిపడుతున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జోక్యం చేసుకోని విచారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.