Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉస్మానియా వేదికగా అనేక పోరాటాలు నిర్వహించే క్రమంలో విద్యార్థుల్లో జార్జిరెడ్డికి వచ్చే ఆదరణను మతోన్మాద శక్తులు జీర్ణించుకోలేక విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆయనను హత్య చేసి భౌతికంగా దూరం చేశారని పీడీఎస్‌యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎల్ పద్మ, ఉస్మానియా యూని వర్సిటీ ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడి ఎస్‌యూ) నిజాం కళాశాల కమిటీ ఆధ్వర్యంలో బుధ వారం జార్జిరెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా నిజాం కళాశా లను తోరణాలతో ఎరుపు మయం చేసి జార్జిరెడ్డికి విద్యా ర్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉస్మాని యా వేదికగా అనేక పోరాటాలు నిర్వహించే క్రమంలో విద్యార్థుల్లో జార్జ్‌కు వచ్చే ఆదరణను మతోన్మాద శక్తులు జీర్ణించకోలేక విద్యార్థి సంఘ ఎన్నికల్లో 1972 ఏప్రిల్ 14 హత్య చేశారని ఆరోపించారు. ఆయన భౌతికంగా దూరమై 51 ఏండ్లు గడిచిందని గుర్తు చేశారు. జార్జ్‌ను హత్య చేసిన అదే భావజాల శక్తులే నేడు అధికారంలో ఉన్నాయనీ, ఆ మతోన్మాద ప్రభుత్వాలే నేడు విద్యను కాషాయీకరణ చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారనీ, దీన్ని ఏక పక్షంగా అమలు చేయడానికి పూనుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు, నిధులు, ఉద్యోగాల పేరుతో అధికా రంలో ఉన్న ఈ తొమ్మిది ఏండ్ల కాలం అధికార దుర్విని యోగానికి పాల్పడుతూ కోట్ల రూపాయల అవినీతి ధనం ప్రగతి భవన్ కు మళ్లీందనీ, కోటి ఆశలతో తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగాలు ముందుగానే అమ్ముడై పోతున్నాయని విమర్శించారు. విద్యార్థులు మరో ఉద్యమానికి సిద్దం కావాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, కృష్ణ, పీడీఎస్‌యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, సహాయ కార్యదర్శి రాకేష్, తిరుపతి, నాగరాజు, పవిత్ర, నవ్య, నవీన్, సాయి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.