Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబిత ఇంద్రారెడ్డి
- అల్మాస్గూడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సహకారంతోనే మహేశ్వరం నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడ గ్రామంలోని 5, 6, 24, 25 డివిజన్లలో రూ.5 కోట్ల 65 లక్షల నిధులతో అనేక అభివృద్ధి పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డితో కలిసి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో ముఖ్యంగా అల్మాస్గూడ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన కాలనీలలో అన్ని ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారని వారికి నూతనంగా ఏర్పాటైన కాలనీలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా భావించి, పక్కా ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం, బిటి రోడ్లు, రోడ్డు వెడల్పు పనులకు నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధిని చూసి మరిన్ని కొత్త కాలనీలు నూతనంగా ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతోనే మహేశ్వరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అనంతరం వైకుంఠ దామం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, రామిడి కవిత రామ్ రెడ్డి,సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, ఏనుగు రామిరెడ్డి, ముత్యాల లలితా కృష్ణ, వంగేటి ప్రభాకర్ రెడ్డి,మనోహర్, కో ఆప్షన్ సభ్యులు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.