Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
నవతెలంగాణ - సంతోష్ నగర్
కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మలక్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల పంపిణీ చేశారు. మలక్ పేట నియోజకవర్గం మం డల డివిజన్ కాలనీకి చెందిన కుటుంబాలకు చెక్కులను అందించారు. కల్యాణ లక్ష్మి షాది ముబారక్ నియోజకవర్గ పరిధిలో కమాల్ నగర్, మూసానగర్, శంకరే, వహీద్ నగర్, హెచ్ఆర్సీ రోడ్డు, పాపయ్య బస్తి, కలదేర కాలనీ, అజంమ్పురా, కాలనీ, సైదాబాద్ కాలనీ, సైదాబాద్ మం డల్ లబ్దదారులకు లక్షా 18వేల 560ల చెక్కులు అందజే శారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లలకు పెండ్లి చేసే సమయంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు తో పాటు అన్ని మతాలు అన్ని కులాల వారికి ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం, వృత్తుల వారీగా అనేక పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు.