Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచకొండ సైబర్ క్రైం డీసీపీ అనురాధ
నవతెలంగాణ - మీర్పేట్
సైబర్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండా లని ఎల్బీనగర్ సైబర్ క్రైం డీసీపీ అనురాధ అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టికేఆర్ కళాశాలలో రాచకొండ సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ మరియు అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ మోసాలు చాలా ఎక్కువ అవుతున్నాయని, లోన్ యాప్స్, ఆన్లైన్ మార్కెటింగ్ ఫేక్ కస్టమర్స్, ఫేక్ ఇన్వె స్ట్మెంట్స్ ఇలాంటి పెద్ద ఎత్తున యాప్స్ వచ్చి సైబర్ క్రైమ్స్ నేరాలు పెరిగాయన్నారు. ప్రతి దాంట్లో కూడా నేరగాళ్లు ఏదో ఒక యాప్ను ఇన్స్టాల్ చేసి మనకు తెలియకుండానే దాని ద్వారా మనం యాప్ను వాడడంతో మన అకౌంట్ లో ఉన్న పర్సనల్ డేటా మరియు నగదును ఈ సైబర్ క్రైమ్ ద్వారా నేరగాళ్లు దోచుకుంటున్నారని చెప్పారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు పంపే ఎటువంటి లింకులను క్లిక్ చేయకూ డదన్నారు. యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండా లని, ఈ మోసాల పట్ల అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మాజీ శాసనస భ్యులు, టికేఆర్ విద్యాసంస్థల చైర్మెన్ తీగల కృష్ణారెడ్డి, ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ, ఏసిపి వనస్థలిపురం పురుషోత్తం రెడ్డి, ఏసీపీ సైబర్ క్రైమ్స్ జీ వెంకటేశం, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్, మీర్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ఎస్సై బద్యానాయక్, రాచకొండ సైబర్ క్రైమ్ చీఫ్ కో-ఆర్డినేటర్స్ సావిత్రి విద్యార్థులు పాల్గొన్నారు.