Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్
ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేక ప్రశ్నించే గొంతు లను అణిచివేసి నిర్బంధాలతో ఎన్నాళ్ళు పాలన సాగిస్తారని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రశ్నించారు. శనివారం నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ లో ఇండ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఅర్ వస్తునారని పోలీసులు బోడుప్పల్‌లోని వజ్రేష్ యాదవ్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్‌నగర్ లో లక్షలాది మంది పేదలు నివాసం ఉంటున్నారని అలాంటి చోటా కనీస మౌలిక సదుపాయాల కల్పన లేదని అదే విధంగా అనేక మందికి ఉండేందుకు ఇండ్లు లేవని, రోజు కూలి నాలి చేసు కుని జీవనం సాగించే పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉందని అన్నారు. జవహర్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ కారణంగా గాలి కాలుష్యంతో పాటు భూ గర్భ కాలుష్యం ఏర్పడిందని పీల్చే గాలి, ఇక్కడి నుండి డంపింగ్ యార్డ్ తరలించాలని ఎన్జీటీ కోర్టు ఆదేశాలు కూడా పట్టించు కోవడం లేదన్నారు. అరెస్టులతో ఉద్యమాలు అపలేరని త్వరలోనే మిమ్మల్ని ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.