Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
- ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి
- 29న అనకాపల్లిలో బహిరంగ సభ
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మానుకుని పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన అనకాపల్లిలో 10వేల మందితో బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి కన్వీనర్ దుర్గా నరేష్ అధ్యక్షతన విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ దేశంలో 75 ఏండ్లుగా పాలించిన కేంద్ర ప్రభు త్వాలు బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదన్నారు. ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో కనీస ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలన్నారు. బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్య యనం జరుగాలన్నారు. బీసీలకు రాజ్యాంగబద్దమైన హక్కులు-వాటా కల్పించాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. త్వరలో సేకరించే జనాభా గననలో బీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ కుల గణన చేపట్టడానికి చట్టపరమైన న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవన్నారు. సుప్రీంకోర్టు, హై కోర్టు బీసీ జనాభా లెక్కలు సేకరించాలన్నారు. 40 ఏండ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి కానీ కేంద్రం బీసీ జనాభా లెక్కలు తీయకుండా అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర కన్వీనర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీలకు జనాభా ప్రకారం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభల్లో 50 శాతం సీట్లు అదనంగా పెంచి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ఈ సీట్లు ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, రాజేందర్, నివాస్, రాష్ట్ర మహిళా కన్వీనర్ హేమలత, అనంతయ్య, సురేశ్, పృద్విగౌడ్, వరప్రకాశ్, విక్రం, రాకేశ్ రాయుడు, మురలి, అశోక్, నూకరాజు, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.