Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో దేశంలో ఏ ప్రభుత్వ యూనివర్సిటీలో లేని విధంగా పెంచిన పీహెచ్డీ ఫీజులను వెంటనే తగ్గించాలనీ, పీహెచ్డీ అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికీ హాస్టల్, మెస్ వసతి కల్పించాలని పరిశోధక విద్యార్థులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో పరిశోధక వి ద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా సంతకాల సేకరణ నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధక విద్యార్థు లు ఫీజుల పెంపు పట్ల ఉస్మానియా యూనివర్శిటీ పాలక వర్గ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ కార్యక్రమానికి మద్ద తుగా వచ్చిన ఉస్మానియా విద్యార్థి పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ కోట శ్రీనివాస్ మాట్లాడుతూ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగమే ఆ ఫీజుల పెంపు అనీ, ఈ విష యంపై యూనివర్సిటీ అంతా సంఘటితంగా పోరాడాల్సి న అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ పాల కవర్గం నిరసనను గుర్తించి ఫీజుల విషయంలో వెనక్కి తగ్గుతుంది అని ఆశిస్తున్నట్టు లేకపోతే పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు నెల్లి సత్య, ఆజాద్ బొడ్డుపల్లి అఖిల్ అఖిల్, కిరణ్, మహేష్, స్వాతి, మంజు భార్గవి, స్వర్ణ లేఖ, సుష్మ, సాహితీ, రమేష్, మధు, రాకేష్, శ్రీవాస్తవ, సోషల్ సైన్సెస్, సైన్సెస్, ఇంజి నీరింగ్, టెక్నాలజీ తదితర విభా గాల పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.