Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లేకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలోఈనెల 18వ తేదీన ఇందిరాపార్కు వద్ద జరిగే నిరుద్యోగుల గోస నిరసన సభను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. శనివారం విద్యానగర్‌లోని చంద్ర పుల్లారెడ్డి భవన్లో రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మామిడికాయల పరుశురాం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకా లు అని 1400 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణ నేడు కుటుంబ పాలనలతో కాలం వెల్లదీస్తున్న దుస్థితి కనబడుతుందన్నారు. టీఎస్పీఎస్ పేపర్ లీకేజీల కేవలం ఇద్దరు ఉద్యోగులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి మీద నెట్టేసి అసలు దోషులు బయటికి రాకుండా షీట్ పేరుతో తొక్కిపడుతూ నిరుద్యోగులను మభ్యపెడుతున్న ప్రభుత్వ తీరు ఎండగడుతూ ఈ నిరసన సభను విజయవంతం చేయాలని నిరుద్యోగ లోకానికి పిలుపునిచ్చారు. పేపర్ లీకేజ్‌తో నష్టపోయిన నిరుద్యో గులకు ప్రతినెలా 50 వేలకు పైగా నిరుద్యోగ భృతి ఇవ్వా లని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును మొత్తం ప్రక్షాళన చేసి వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్, సురేష్, నాయకులు రియాజ్, గణేష్, నాగరాజు, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.