Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
పార్కిన్సన్ వ్యాధిని ముందుగా గుర్తించి సరైన వైద్యం అందిస్తే వారు సాధారణ పరిస్థితులకు వచ్చేస్తారని డాక్టర్ రుక్మిణి అన్నారు. ఆదివారం పార్కిన్సన్ వ్యాధిపై బంజారా హిల్స్ కేబీఆర్ పార్కు వద్ద సిటీ న్యూరో సెంటర్, పార్కిన్సన్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, దొబారా స్వచ్ఛంద సంస్థలు సంయుక్తం గా అవగాహన నడక నిర్వహించాయి. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. వ్యాధికి చికిత్సతో పాటు వ్యాయామం,యోగా,నడక కూడా ఎంతో అవసరమన్నారు.చాలా మందికి ఈ వ్యాధిపై అవగాహన లేదని ఈ వ్యాధి వచ్చిన వారిని సమాజంలో అంటరాని వారుగా చూడవద్దని అన్నారు. వైద్య రంగంలో వచ్చిన వివద రకాల టెక్నాలజీని ఉపయోగించి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కేబీఆర్ పార్కు వద్ద నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఈ నడక కొనసాగింది. డాక్టర్లు రూపం, రాజేష్, రత్నకిషోర్, అంజన హైదరాబాద్ యోగా క్లబ్ ప్రతినిధులు శ్రీదేవి, రమేష్ ,దొబారా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మతీన్ అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.